విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ లీలావతి ఆధ్వర్యంలో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి రక్త బంధువులు లేకపోవటం.. దూరపు బంధువులు పట్టించుకోకపోవటంతో నిరాదరణకు గురయ్యాడు. మండలంలోని రోడ్డుపక్కనే ఉన్న చింతచెట్టు కింద మూడు రోజుల నుంచి ఉంటూ.. మరణించాడు. కరోనా కారణంగా ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులే దగ్గరుండి చివరి తంతు కానిచ్చారు. మృతుడు నెల్లిమర్ల మండలం సీతారాంపేటకు చెందిన కళ్యాణపు లక్ష్మణరావు (70) గా గుర్తించినట్లు ఎస్ఐ లీలావతి తెలిపారు. అనాథకు అంత్యక్రియలు చేయటంపై.. పోలీసుల పెద్ద మనస్సును ప్రజలు అభినందిస్తున్నారు.
పోలీసుల పెద్ద మనసు.. అనాథ మృతదేహానికి అంత్యక్రియలు - today gurla police latest news update
కరోనా ధాటికి అయినవాళ్లెందరున్నా అనాథలవుతున్నారు. అలాంటిది రక్త బంధాలు లేక.. ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి మృతి చెందితే ఎవరు పట్టించుకుంటారు. ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లా గుర్లలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అన్నీ తామే అయి.. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అనాథ మృతదేహనికి పోలీసులు అంత్యక్రియలు