ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాకవి గురజాడ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి - విజయనగరంలో గురజాడ జయంతి వేడుకలు

సోమవారం నిర్వహించనున్న మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలకు విజయనగరంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

gurajada apparao birth celebrations in vizianagaram
మహాకవి గురజాడ అప్పారావు

By

Published : Sep 20, 2020, 7:07 PM IST

ఈనెల 21న మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు 158వ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ తెలిపారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో అధికారికంగా నిర్వ‌హించే ఈ ఉత్స‌వం విజ‌య‌న‌గ‌రంలోని గుర‌జాడ స్వ‌గృహంలో ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు.

గుర‌జాడ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి, జ్యోతి ప్ర‌జ్వ‌లన చేసిన అనంత‌రం స‌త్య లాడ్జి స‌మీపంలోని గుర‌జాడ కాంస్య విగ్ర‌హం వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. అక్క‌డ మ‌హాక‌వి విగ్ర‌హానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పిస్తారని.. అనంతరం దేశ‌భ‌క్తి గేయాలాప‌న జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌ముఖులు త‌మ సందేశాల‌ను వినిపిస్తార‌ని తెలిపారు. ప్ర‌తిఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కుల‌ు ధ‌రించి ఈ వేడుక‌ల్లో పాల్గొనాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details