కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దాతృత్వంతో ముందుకు రావటాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. ప్రజలు లాక్డౌన్ నిబంధలను పాటిస్తూ... కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కళాకారులకు నిత్యావసర సరకుల పంపిణీ - కళాకారులకు నిత్యవసర సరుకుల పంపిణీ
ప్రజలు లాక్డౌన్ నిబంధలను పాటిస్తూ...కరోనా నియంత్రణకు సహకరించాలని ఎమ్మెల్యే వీరభద్రస్వామి కోరారు. కష్టకాలంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభినందించారు.
![కళాకారులకు నిత్యావసర సరకుల పంపిణీ కళాకారులకు నిత్యవసర సరుకుల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7306955-548-7306955-1590162016971.jpg)
కళాకారులకు నిత్యవసర సరుకుల పంపిణీ
విజయనగరం రాజీవ్ స్టేడియంలో రోటరీ, లీ ప్యారడైజ్ కన్వెన్షన్ సంస్థల సహకారంతో 320 మంది కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ... లాక్డౌన్ సమయంలో పేదవారికి నిత్యావసర వస్తువులు అందాలనే తలంపుతో ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.