ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి' - సీపీఎస్ రద్దు తాజావార్తలు

సీఎం జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ఆస్కారరావు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, హెల్త్​ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీలను అమలు చేయలన్నారు.​

'సీఎం జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

By

Published : Nov 22, 2020, 4:57 PM IST

అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేసి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్... ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ఆస్కారరావు ఆక్షేపించారు. విజయనగరం యూత్ హస్టల్​లో సమావేశం నిర్వహించిన ఆయన... ప్రజా సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి ముందున్నా.. అధికారుల విధానాలు సరిగా లేనిని విమర్శించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులిచ్చి నగదు రహిత వైద్యాన్ని అందిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details