రేపటి గవర్నర్ పర్యటనకు విజయనగరం ముస్తాబు - రేపు విజయనగరంలో గవర్నర్ పర్యటన... ముమ్మరంగా అధికారుల ఏర్పాట్లు
గురువారం విజయనగరం జిల్లా ఏజన్సీ మండలాల్లో గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించనున్నారు. గిరిజనుల ఆర్థిక స్థితిగతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా వారికి అందుతున్న సేవలు, ఆ ప్రాంతాల అభివృద్ధికి కల్పిస్తున్న మౌలిక సదుపాయలు పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు.
విజయనగరం జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. గవర్నర్ బిశ్వభూషణ్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీకాప్టరులో సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో సాలూరు సమీపాన గుమడాంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకుంటారు. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిశిఖర గర్భిణీల వసతి గృహాన్ని సందర్శించి లబ్దిదార్లతో ముచ్చటిస్తారు. అనంతరం పార్వతీపురం సమగ్ర గిరిజనాభి సంస్థ ద్వారా విద్య, వైద్య, ఆరోగ్యం, త్రాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో అందుతున్న సేవలను గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సిసోడియా గవర్నర్‌కు వివరిస్తారు. అక్కడి నుంచి పాచిపెంట మండలంలో అత్యంత వెనుకబడిన పి.టి.జి. తెగలకు చెందిన గదబలు నివాసం ఉండే అమ్మవలస చేరుకుంటారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సేవలు, ఇతర అంశాలపై ముఖాముఖి చర్చించారు. పాచిపెంట మండలం పి.కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థినుల ముఖాముఖిలో పాల్గొని... సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం గవర్నరు రోడ్డు మార్గంలో సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్ చేరుకుని., అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటించే ప్రాంతాలు, రహదారులను సుందరంగా తీర్చిదిద్దారు.
TAGGED:
ap_vzm_04_30_governor