లాక్ డౌన్ ప్రారంభం కాక ముందు నుంచే ఇసుక లేక రోడ్డున పడ్డామని, తమని ప్రభుత్వం ఆదుకోవడం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోయారు. పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న వారికి జీతాలు సరిగా ఇవ్వటం లేదని, తక్షణమే జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విలేకరుల సమావేశంలో కోరారు.
'భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' - AITUC
లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారని విజయనగరం ఏఐటీయూసీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకుని పదివేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బి కృష్ణంరాజు, భవన కార్మికుల సంఘాల నాయకులు మజ్జి ఆదిబాబు, గురవారెడ్డి రాంబాబు, కే ఎర్రయ్య, సూరి నాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పార్వతీపురంలో ఈదురు గాలులకు పాడైన పడవలు