రైతుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని... ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖామాత్యులు పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రావాడవట్టిగడ్డ జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు పుష్ప శ్రీవాణి నీటిని విడుదల చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని... అందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సహాయం రైతుల చెంతకు చేరేటట్లు నూతన విధానాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆమె కోరారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: పుష్ప శ్రీవాణి - పుష్పా శ్రీవాణి వార్తలు
రైతుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖామాత్యులు పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రావాడవట్టిగడ్డ జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు... నీరు విడుదల చేశారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: పుష్పా శ్రీవాణి