సులభతర వాణిజ్యం దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజనెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక పోటీని ఎదుర్కొనేందుకు అత్యుత్తమ స్థాయి మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ మేరకు..రాష్ట్రంలో 30 నైపుణ్యాల అభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
'ప్రపంచ స్థాయి పారిశ్రామిక పోటీని ఎదుర్కొనే లక్ష్యంతో పని చేస్తున్నాం' - గౌతం రెడ్డి న్యూస్
ప్రపంచ స్థాయి పారిశ్రామిక పోటీని ఎదుర్కొనేందుకు అత్యుత్తమ స్థాయి మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన ఈజీ ఆఫ్ డూయింగ్ బిజనెస్ సదస్సులో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో 30 నైపుణ్యాల అభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
పరిశ్రమల ఏర్పాటుకోసం వచ్చే పారిశ్రామిక వేత్తలకు తక్కువ ఖర్చు, శ్రమతో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి చర్యల్లో భాగంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కొవిడ్ సమయంలో చిన్న పరిశ్రమలకు 1,100 కోట్లు ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారన్నారు. పెట్టుబడులు ఆకర్షించిన మేటి రాష్ట్రాల్లో ఏపీ కొవిడ్ కాలంలోనూ రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధిలో భాగంగా కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇప్పటికే అదాని డేటా సెంటర్, యోకోహోమా జపనీస్ టైర్ల కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయన్నారు.
ఇదీచదవండి:పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు