ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు తీపికబురు - Good news for vizianagaram Agrigold victims news

విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జిల్లాలో 10 వేలు, అంత కంటే తక్కువ మొత్తాలను డిపాజిట్ చేసిన వారికి నగదు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Good news for vizianagaram Agrigold victims
విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు తీపికబురు

By

Published : Oct 15, 2020, 3:14 PM IST

విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు 4.5 కోట్ల రూపాయల మేర అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 10 వేలు, అంత కంటే తక్కువ మొత్తాలను డిపాజిట్ చేసిన వారికి ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 వేల రూపాయల లోపు డిపాజిట్లు చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 4.5 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించాల్సిందిగా ప్రభుత్వం విజయనగరం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి స్పష్టం చేసింది. విశాఖ జిల్లాలో చెల్లింపుల అనంతరం మిగిలిన ఈ మొత్తాన్ని విజయనగరం జిల్లాకు బదిలీ చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే జిల్లాలో పదివేలు అంతకంటే తక్కువ మొత్తాలను డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details