విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు కలసి కరోనా బారి నుండి ప్రజలకు విముక్తి ప్రసాదించమని పూజలు చేశారు. 108 కొబ్బరి కాయలను కొట్టి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరగటంతో నాలుగు నెలలుగా స్వర్ణకారులకు పనులు లేక రోడ్డున పడ్డారని స్వర్ణ కారుల సంఘం నాయకులు అన్నారు.
'తల్లి కరోనా బారి నుంచి విముక్తి ప్రసాదించు' - Paiditally Ammavari Temple
విజయనగరంలో విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు కలసి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద 108కొబ్బరి కాయలను కొట్టి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. కరోనా బారి నుండి ప్రజలుకి విముక్తి ప్రసాదించాలని కోరారు.
తల్లి కరోనా బారి నుంచి విముక్తి ప్రసాదించు
ఒక వైపు ఇంటి అద్దె మరోవైపు షాప్ అద్దె కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమని ఆదుకుని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు జానం ప్రసాదరావు, స్వర్ణకారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి పెట్రోల్, డీజిల్పై అదనపు సుంకం తగ్గించాలని తెదేపా ఆందోళన