ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ మృతదేహంపై బంగారం మాయం! - విజయనగరంలో కరోనా మృతదేహంలోపై బంగారం న్యూస్

కొవిడ్ ఆసుపత్రిలో మార్చురీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని కొంతమంది ఆరోపిస్తున్నారు. వైరస్ సోకి మృతి చెందిన వ్యక్తి మెడలోని బంగారం మాయం చేశారన్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

కొవిడ్​ మృతదేహంపై బంగారం మాయం!
కొవిడ్​ మృతదేహంపై బంగారం మాయం!

By

Published : Aug 26, 2020, 8:41 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం.రాజాపురం మండలానికి చెందిన సరస్వతీ అనే మహిళ.. కరోనాతో శ్రీకాకుళం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శ్వాసపరమైన ఇబ్బందితో మృతి చెందింది. అప్పటికే ఆమె ఒంటి మీద 3.5 తులాల ఆభరణాలు ఉన్నాయని.. మృతురాలి బంధువులు చెబుతున్నారు.

ఆసుపత్రిలో మృతదేహాన్ని అంబులెన్స్​లోకి ఎక్కించేముందు.. చూస్తామని చెబితే చూపించలేదని ఆరోపిస్తున్నారు. తమ ఊరికి వచ్చాక.. తగిన జాగ్రత్తలు తీసుకుని.. మృతదేహాన్ని దూరం నుంచి చూశామని.. బంగారం లేదని గుర్తించామని చెప్పారు. ఈ విషయంపై ఆసుపత్రి అధికారులను సంప్రదించగా.. గతంలో ఇలాంటి ఫిర్యాదులు రాలేదని.. ఘటనపై సంబంధిత సిబ్బందిని విచారణ చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details