విజయనగరం జిల్లావ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో గోపూజ ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో గోవులకు పూజలు నిర్వహించారు. విజయనగరం... తితిదే కల్యాణ మండపంలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో గోవుకు వస్త్ర, పుష్పాలంకరణ చేశారు. అర్చనతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలోనూ గోవులను పూజించారు.
జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో గోమాతకు ప్రత్యేక పూజలు - go pooja in Vizianagaram
కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో గోపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా నగరంలోని తితిదే కల్యాణ మండపం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో గోమాతను పూజించారు.

జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో గోమాతకు ప్రత్యేక పూజలు