విజయనగరం జిల్లా సాలూరు మండలం నక్కడవలస గ్రామానికి చెందిన మజ్జి చాందినిరాణి... పాచిపెంట మండలం పి. కోనవలస గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంట్లో పనులు చేయకుండా... చదువుకోవాలని తండ్రి రాములు మందలించాడు. ఈ ఘటనతో చాందినిరాణి మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తండ్రి మందలించాడని.. మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్య
విజయనగరం జిల్లా నక్కడవలసలో విషాదం నెలకొంది. చదువుకోవాలని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
గమనించిన బంధువులు ద్విచక్రవాహనంపై హుటాహుటిన సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.