విజయనగరం జిల్లా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామం నేరెళ్ల వలసలో ఓటింగ్ వివాదస్పదమయింది. బూతు నెంబరు 1లో 1,083 ఓట్లు, నాలుగో బూతులో 779 ఓట్లు ఉండగా... సుమారు 12వందల ఓటర్లను ఇప్పటికే ఒడిశాలో వేశారంటూ అధికారులు అడ్డుకున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజనుల ఆందోళన నిర్వహించారు. వెంటనే కలెక్టర్ స్పందించి దీనికి కారణమైన ప్రీసైడింగ్ ఆఫీసర్పై చర్యలు తీసుకొని... రీపోలింగ్ నిర్వహించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
మా హక్కుల్ని కాలరాస్తున్నారు: నేరెళ్ల వలస గిరిజనులు - 2019 elections
రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారని ఒడిశా సరిహద్దు గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేయకుండా అధికారులు అడ్డుకున్నారని, రీపోలింగ్ నిర్వహించి ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
మా హక్కుల్ని కాలరాస్తున్నారు