ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోలీలో ఆసుపత్రికి తరలింపు.. మధ్యలోనే ప్రసవం...

విజయనగరం జిల్లా మారిక గిరిజన గ్రామానికి చెందిన గర్భిణిని డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. ఒక మగ బిడ్డకు జన్మనివ్వగా.. వారిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

women gave birth to a baby in forest
మార్గమధ్యలో ప్రసవించిన మహిళ.. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమం

By

Published : Feb 25, 2021, 9:01 AM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని వేపాడ మండలం మారిక గిరిజన గ్రామానికి చెందిన గర్భిణిని డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. కరకవలస పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన మారిక కొండల్లో ఉంటుంది. వీరికి కనీస అవసరాలు రావాలన్నా ఏడు కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది.

గ్రామానికి చెందిన గమ్మెల బిమలకు పురిటినొప్పులు రావడంతో స్థానికులు డోలి కట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నొప్పులు ఎక్కువై ప్రసవించింది. ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీ బిడ్డలను మోసుకుంటూ తీసుకెళ్లి.. ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details