ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్దంగా 2.45 లక్షల కిలోల గంజాయి స్వాధీనం - Andhra Pradesh latest news

Ganjai In Visakhapatnam and East Godavari : విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలలో గంజాయి సాగు జరుగుతుందని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,45,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలేజీలు, స్కూల్స్ వద్ద ఎస్ ఈబి టోల్ ఫ్రీ నెంబర్లతో హోర్డింగ్​ల ద్వారా ప్రచారం చేస్తామని పోలీసులు తెలిపారు.

డిజిపి
DGP

By

Published : Dec 23, 2022, 10:49 PM IST

Ganjai In Visakhapatnam and East Godavari : విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలలో గంజాయి సాగు జరుగుతుందని పోలీసులు గుర్తించారు. గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, ఎస్‌ఐ‌బి సంయుక్తంగా రెండు నెలల్లో మొత్తం 600 ఎకరాల్లోని గంజాయి సాగును ధ్వంసం చేశారని డీజీపి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,45,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 70% ఒరిస్సా నుండి వస్తున్నట్లు తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని విడతల వారీగా దహనం చేయనున్నన్నారు.

గంజాయి సాగు,రవాణా, నియంత్రణ, లభ్యతపై దృష్టి పెడతామని.. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు సరఫరా చేస్తున్న నెట్ వర్క్ పై నిఘా ఉంచాలని 2023 తమ లక్ష్యమన్నారు. కాలేజీలు, స్కూల్స్ వద్ద ఎస్ ఈబి టోల్ ఫ్రీ నెంబర్లతో హోర్డింగ్ ల ద్వారా ప్రచారం చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details