100 కిలోల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్టు - 100 కిలోల గంజాయి పట్టివేత
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
100 కిలోల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్టు !
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన భీమరాజు, రామారావు అనే వ్యక్తులు ఆటోలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మాటు వేసిన పోలీసులు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి...వాహనాన్ని సీజ్ చేశారు.