ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'Freedom of Voice' Discussion Program on Chandrababu Arrest: 'రాష్ట్రంలోని షెల్ కంపెనీలకు జగనే ఫౌండర్' - Waji Channel MD Srinivasa Rao comments

'Freedom of Voice' Discussion Program on Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై విజయనగరంలో "ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్" పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న. .వాజీ ఛానల్ ఎండీ, టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, జనసేన రాష్ట్ర కార్యదర్శి, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శిలు చంద్రబాబు అరెస్ట్‌ను ముక్త కంఠంతో ఖండించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఇంటికి పంపిస్తామని పేర్కొన్నారు.

Freedom_of Voice_Discussion
Freedom_of Voice_Discussion

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 10:14 PM IST

'Freedom of Voice' Discussion Program on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌పై విజయనగరంలో వాజీ ఛానల్ ఆధ్వర్యంలో "ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్" పేరిట చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వాజీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, జనసేన రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, సీపీఐ రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీష్, టీడీపీ విజయనగరం జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ విజయనగరం కార్యదర్శి దయానంద్ తదితరులు పాల్గొని..చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ని ముక్త కంఠంతో ఖండించారు.

Waji Channel MD Srinivasa Rao Comments: వాజీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ఉపాధి లభించిందని గుర్తు చేశారు. ఫైబర్ నెట్ ద్వారా పల్లెల్లో సాంకేతిక విప్లవం ఊపందుకోవటమే కాకుండా.. కేబుల్ వ్యాపార రంగం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యానించారు. ఇంత మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి.. జైలులో ఉంచడం తనకు బాధ కలిగించిందన్నారు. అందుకే చంద్రబాబుకి మద్ధతు తెలియచేసేందుకే ఈరోజు "ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్" పేరిట చర్చా వేదికను ప్రారంభించామని పేర్కొన్నారు.

Lokesh Comments on CBN Security: చంద్రబాబుకు జైలులో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్​

Former TDP MLC Jagdish Comments:చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని.. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ద్వారాపు రెడ్డి జగదీష్ అన్నారు. చంద్రబాబు నాయుడు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని షెల్ కంపెనీలకు జగనే ఫౌండర్ అని, అవినీతి డబ్బు మళ్లించడంలో జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

Janasena State Secretary Yashasvi Comments: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి యశస్వి ప్రసంగిస్తూ.. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆటవిక రాజ్యం కనిపిస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకుల విషయంలో అవాస్తవాలను-వాస్తవాలుగా మార్చే పరిస్థితి జగన్ పాలనలో నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు తమ గొంతుని వినిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. జగన్ సీఎం అయినప్పటీ నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించిన వారిపై.. కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు.

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

''ఒక దొంగను మనం రాష్ట్రానికి సీఎంగా తీసుకొచ్చాం. తండ్రి పేరు చెప్పుకుని కోట్లాది రూపాయలను కొట్టేసి.. జైలుకు వెళ్లాడు. రానున్న ఎన్నికల్లో అతనికి ఎవరూ అడ్డులేకుండా ఉండాలనే దురుద్దేశ్యంతోనే చంద్రబాబుని అరెస్టు చేయించి జైలుకు పంపించాడు. కేసులో బలం లేదని తెలిసి.. ఇతర కేసులను బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైసీపీ పరిపాలన పోయే వరకు.. అన్ని పార్టీలు కలిసి కృషి చేయాలి. రాష్ట్రంలో ప్రజా పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలి.''-సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీల అధ్యక్షులు

Union Minister Nitin Gadkari on Chandrababu: చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ABOUT THE AUTHOR

...view details