విజయనగరం జిల్లా వ్యాప్తంగా జూన్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్ తెలియచేశారు. జూన్ నుంచి జిల్లాలోని మొత్తం 7లక్షల కార్డుదారులకు బియ్యం అందించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను తెలియజేశారు.
సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఫోర్టిఫైడ్ బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఫోర్టిపైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారు.