ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతి రాజు(Former Union Minister Ashok Gajapathiraju) అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన అశోక్ గజపతిరాజుకి.. పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వదించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.
Ashok Gajapathiraju: ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలని ప్రార్థించా: అశోక్ గజపతిరాజు - Ashok Gajapathiraju and his family visited Paiditalli Ammavati temple
విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారిని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు(Former Union Minister Ashok Gajapathiraju) కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.
Ashok Gajapathiraju
రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని మతాలను గౌరవించడం ప్రభుత్వ విధి అని..అయితే అహం పెరిగి ధర్మం పోయిందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
ఇదీ చదవండి