విజయనగరం జిల్లా కురుపాం మండలంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ దేవ్.. అతని తండ్రి చంద్ర చూడమణి దేవ్ జన్మదినం సందర్భంగా గ్రామస్థులకు కురుపాం కోటలో అన్నదానం చేశారు. తన తండ్రి పేరుతో ఇటీవల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించారు. సింహాచలం దేవస్థానం వద్ద, పలుచోట్ల ఉన్న అనాథ ఆశ్రమాలకు నెల రోజులకు సరిపడా సరకులు అందించారు. అనంతరం కోటలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కురుపాం కోటలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ - అన్నదానం కార్యక్రమం వార్తలు
విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ దేవ్ ప్రజలకు అన్నదానం చేశారు. ఎంపీ తండ్రి చంద్ర చూడమణి దేవ్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమం