కుటియా గ్రామప్రజలతో మాజీ ఎంపీ కొంపంగి సమావేశమయ్యారు. తమ ప్రాంతంలో పాఠశాల, వైద్య సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరారు. స్థానికులు మట్టిరోడ్డు నిర్మించుకున్నాక.. సినీ నటుడు సోనూసూద్ స్పందించడంతో అధికారులు కదిలారు. ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి పది రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయినా నేటికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని.. గ్రామస్థులు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
అప్పుడు హడావిడి చేశారు.. తర్వాత మర్చిపోయారు... - కుటియా గ్రామప్రజలను కలుసుకున్న మాజీ ఎంపీ కొంపంగి
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కుటియా గ్రామప్రజలతో మాజీ ఎంపీ కొంపంగితో సమావేశమయ్యారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. గతంలో మట్టి రోడ్డు నిర్మించుకొన్నామని, అప్పట్లో సినీ నటుడు సోనూసూద్ స్పందించడంతో అధికారులు కదిలారని, ఆ తర్వాత పట్టించుకోలేదని తెలిపారు.
కుటియా గ్రామప్రజలను కలుసుకున్న మాజీ ఎంపీ కొంపంగి