విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెదేపా అధినేత చంద్రబాబుకు పంపారు. ఐదేళ్ల నుంచి పార్టీలో సరైన గుర్తింపు లేదని తెలిపారు. అందుకే తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి గెలుపునకు కృషి చేశారని పేర్కొన్నారు.
తెదేపా క్రియాశీలక సభ్యత్వానికి మాజీ మంత్రి అరుణ రాజీనామా - మాజీ మంత్రి పడాల అరుణ తాజా వార్తలు
పంచాయతీ పోరులో గెలుపు కోసం తెదేపా ప్రయత్నాలు చేస్తుంటే... పార్టీలో ఆదరణ లభించక సీనియర్లు రాజీనామా చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

తెదేపా సభ్యత్వానికి మాజీ మంత్రి అరుణ రాజీనామా