లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. విజయనంగరం జిల్లా ఎ.రావివలస పంచాయతీ నారుపేట గ్రామానికి చెందిన నారు పైడినాయుడు రహదారులపై ప్రయాణించే వలస కూలీలకు గత వారం రోజులుగా ఆహారం అందిస్తున్నారు. రోజు సుమారు 500 మందికి కడుపు నింపుతూ సేవాభావాన్ని చూపుతున్నారు. లాక్డౌన్ ఉన్నంత వరకు ఆహారం అందిస్తానని పైడినాయుడు స్పష్టం చేశారు.
నిరుపేదలు, వలస కూలీలకు ఆహారం పంపిణీ - విజయనగరంలో పేదలుకు ఆహారం పంపిణీ
కరోనా మహమ్మారి వలస కూలీలు, నిరుపేదలకు శాపంగా మారింది. లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి కడుపు నింపేదుకు దాతలు ముందుకొస్తున్నారు. విజయనగరం జిల్లా నారుపేట గ్రామానికి చెందిన నారు పైడినాయుడు వలస కూలీలకు గత వారం రోజులుగా ఆహారం అందిస్తూ సేవాభావాన్ని చూపుతున్నారు.

నిరుపేదలు, వలస కూలీలకు ఆహారం పంపిణీ