విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC) వరద నీటిలో మునిగిపోయింది. సమీపంలోని స్వర్ణముఖి నదికి వరదనీరు పోటెత్తడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. ప్రమాదాన్ని ముందస్తుగా గమనించిన ఆరోగ్య కేంద్రం సిబ్బంది... హుటాహుటిన రోగులను మరోచోటకు తరలించారు. కంప్యూటర్లను పక్కనున్న క్వార్టర్ కు చేర్చారు. మిగిలిన వస్తువులను తరలించేలోపు.... ఒక్కసారిగా వరదనీరు ఆసుపత్రిని చుట్టుముట్టడంతో సిబ్బంది పరుగులు తీశారు. సిబ్బంది చూస్తుండగానే వర్షపు నీరు మొత్తం ఆసుపత్రిని ముంచెత్తింది. దీంతో ఆసుపత్రిలోని విలువైన దస్త్రాలు, మందులు, రిఫ్రిజిరేటర్లు, మూడు ఇన్వర్టర్లు నీటిపాలయ్యాయి.
Rains in AP: వరద నీటిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. సిబ్బంది చూస్తుండగానే... - విజయనగరం తాజా వార్తలు
విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC) వరదనీటిలో మునిగిపోయింది. సమీపంలోని స్వర్ణముఖి నదికి వరదనీరు(RAIN WATER) పోటెత్తడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది.

మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు
మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు