విజయనగరం జిల్లాలో ఫిట్ ఇండియా కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. పార్వతీపురం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ ప్రారంభించిన టూకే రన్ లో ఉద్యోగాలు, విద్యార్దులు ఉత్సాహంగా పరుగులు తీశారు. యోగాసనాలు, టైక్వాండో విన్యాసాలు విద్యార్థుల్లో జోష్ ను పెంచాయి. ఆరోగ్య భారతం కోసం ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పీవో అన్నారు.
విజయనగరంలో ఘనంగా ఫిట్ ఇండియా - vizianagaram district
ఆరోగ్యకర భారతం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో అధికార్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్దులు భారీగా పాల్గొన్నారు.
విజయనగరంలో జరిగిన మరో కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్,శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి,సంయుక్త కలెక్టర్ వెంకట రమణా రెడ్డి లు పాల్గొన్నారు.రాజీవ్ క్రీడా మైదానం నుంచి కోట కూడలి వరకుచేపట్టినఈర్యాలీలో క్రీడాకారులు,విద్యార్దులు భారీగా పాల్గొన్నారు.క్రీడాకారులనురాష్ట్రప్రభుత్వంఅన్నివిధాలా ప్రోత్సహిస్తోందని,క్రీడాకారులు వీటిని వినియోగించుకొని ఎంపీ ఆకాంక్షించారు.జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లోనూరూ.2కోట్లతోమినీ స్టేడియంల నిర్మాణం జరుగుతోందనిఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.