ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అజెండాను 2 వార్డులకే పరిమితం చేస్తే ఎలా?' - Parvathipuram latest news

విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం తొలి సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభ.. సభ్యుల వాదనలతో ముగిసింది.

first meeting of the Parvathipuram Municipality
పురపాలక సంఘం తొలి సమావేశంలో వాదోపవాదాలు

By

Published : Mar 30, 2021, 7:10 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం తొలి సమావేశం రసాభాసగా సాగింది. ఛైర్​ పర్సన్​ బోను గౌరీశ్వర అధ్యక్షతన మొదటి సభ జరిగింది. తెదేపా సభ్యులు ఛైర్​పర్సన్​కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం అజెండాను చదివి వినిపించారు. అజెండాను రెండు వార్డులకే పరిమితం చేయటం సరికాదని.. అన్నీ వార్డులకు సంబంధించి తయారుచేయాలని 14వ వార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీదేవి అన్నారు.

ఈ విషయంపై... వైకాపా కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. వారి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెదేపా కౌన్సిలర్లు.. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. చివరికి సభ.. ఇలా వాదోపవాదాల మధ్యే ముగిసింది. మరోవైపు... ముప్పై వార్డులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సమావేశానికికు హాజరైన ఎమ్మెల్యే జోగారావు అన్నారు. తమ వార్డుల పరిధిలోని సమస్యలను తెలియచేయాలని కౌన్సిలర్లను కోరారు.

ABOUT THE AUTHOR

...view details