విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అగ్నిమాపక శాఖ, భారత్ పెట్రోలియం వారి ఆధ్వర్యంలో చీపురుపల్లి అగ్నిమాపక శాఖ కార్యాలయం దగ్గర భారత్ పెట్రోలియం బంకును ఆ శాఖ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఆహాసన్ రెజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం ప్రతినిధులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇది నాలుగోది..
ప్రజలకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు భారత్ పెట్రోలియంతో కలిసి పెట్రోల్ బంకును ఏర్పాటు చేశామని రీజనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యలో ప్రారంభించిన పెట్రోల్ బంకుల్లో ఇది నాలుగోదని పేర్కొన్నారు. కైకలూరు, మచిలీపట్నం, గుడివాడలో ఇప్పటికే ఏర్పాటు చేయటం జరిగిందన్న ఆయన.. ప్రస్తుతం చీపురుపల్లిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చీపురుపల్లిలో ఫైర్ సర్వీస్ పెట్రోల్ బంక్ ప్రారంభం - చీపురుపల్లిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు తాజా వార్తలు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అగ్నిమాపక శాఖ, భారత్ పెట్రోలియం వారి ఆధ్వర్యంలో చీపురుపల్లి అగ్నిమాపక శాఖ కార్యాలయం దగ్గర భారత్ పెట్రోలియం బంకును ఆ శాఖ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఆహాసన్ రెజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం ప్రతినిధులతోపాటుగా జిల్లాల అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
చీపురుపల్లిలో ఫైర్ సర్వీస్ పెట్రోల్ బంక్ ప్రారంభం
ఇవీ చూడండి..