విజయనగరం జిల్లా భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామంలో రహదారికి ఆనుకుని ఉన్న కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అదే గ్రామానికి చెందిన పైడ్రాజు కొన్నేళ్లుగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అనుకోకుండా దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిందా? లేదా ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా.. అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువత స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. 3లక్షల ఆస్తినష్టం - fire accident in viziangaram
అప్పటివరకు వ్యాపారం సాఫీగా సాగుతున్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అంతే సమీపంలో ఉన్న వారంతా ఉరుకులు పరుగులు.. ఇదంతా విజయనగరం జిల్లా భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామంలో జరిగింది.
fire accident in grossary shop in viziangaram dst lakhs worth property loss