విజయనగరం జిల్లా సాలూరు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన లారీడ్రైవర్ కుటుంబానికి హైందవ ధర్మ సేవ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా నివాసం ఉండే శివ అనే వ్యక్తి లారీ నడుపుతూ జీవనం సాగించేవాడు. వచ్చిన సంపాదనతో ఇళ్లు గడిచేది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మరణించాడు. ఫలితంగా ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. పూట గడవడం కష్టమైపోయింది. అది గుర్తించిన హైందవ ధర్మ సేవ సభ్యులు వారికి రూ. 50వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరకులు అందించారు. తమకు ఆర్థికంగా సాయం చేసిన హైందవ ధర్మ సేవ సభ్యులకు శివ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మృతిచెందిన లారీడ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం - Lorry driver to family in Vijayanagar district
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లారీ డ్రైవర్ కుటుంబానికి హైందవ ధర్మ సేవ సభ్యులు ఆర్థిక సాయం చేశారు. రూ.50వేలు, నిత్యవసర వస్తువులు అందజేశారు.
లారీడ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం