విజయనగరంలోని 25వ డివిజన్ నాగవంశపు వీధిలో భాజపా, వైకాపా వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాత్రి జరిగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. వీరిలో 21 డివిజన్ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి కాళ్ల నారాయణరావు, వైకాపా నాయకుడు ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా మారటంతో.., ఇద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. 25వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేయించే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు తరువాత దాడికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
వైకాపా, భాజాపా నేతల మధ్య ఘర్షణ...ముగ్గురికి గాయాలు - fight between ycp and bjp
వైకాపా, భాజాపా వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా 25వ డివిజన్ నాగవంశపు వీధిలో జరిగింది. పారిశుద్ధ్య పనులు చేయించే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వైకాపా, భాజాపా నేతల మధ్య ఘర్షణ
TAGGED:
fight between ycp and bjp