విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామ పరిధిలో... రాత్రి వేళల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా వరి, అరటి, కాకర, చెరుకు, బొప్పాయి పంటలు ఏనుగుల దాడిలో ధ్వంసం అయ్యాయి. ఎక్కువ మోతాదులో పంట నష్టం జరిగినా... అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరెవరు బాధితులు
కుమ్మరగుంట గ్రామ పరిధిలో ఉన్న కోట బాలకృష్ణకి సంబంధించిన బొప్పాయి తోట పూర్తిగా నష్టపోయింది. మిరియాల సుశీలకు సంబంధించి కాకర తోట, డ్రిప్ పైపులు, వరి మళ్లను కాళ్లతో తొక్కేశాయి. కొల్లి సింహాచలంకు సంబంధించి 2 ఎకరాల అరటి, కాకర తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. కొల్లి సింహాచలంకి సంబంధించి కాకర, చెరుకు తోటలను నాశనం చేశాయి. స్వామినాయడు వలస గ్రామానికి చెందిన మరడాన తిరుపతినాయుడు భూమిలో చెరుకు పంటను పూర్తిగా నష్టం చేశాయి.
గత ఆరు నెలలుగా కొమరాడ మండలాన్ని అతలాకుతలం చేస్తున్న ఏనుగులను తరలించేందుకు... చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి మూర్తి తెలిపారు. ఇలా ఎన్ని రోజులు నష్టపోవాలని రైతులు మండిపడుతున్నారు.
ఏనుగుల బీభత్సం.. పంటలు ధ్వంసం - పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు
తమ నోటి దగ్గరకి వచ్చే పంటల ఫలాన్ని... ఏనుగులు లాగేసుకుంటున్నాయని కురుపాం నియోజకవర్గంలోని కుమ్మరిగుంట గ్రామ రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్నాళ్లు వీటిని భరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు
ఇదీ చదవండి:బొబ్బిలి రైతన్నలకు పిల్ల కాలువల కష్టాలు