విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో 250 హెక్టర్లలో టమాట సాగు చేశారు. వారంతా.. దిగుబడికి తగిన ధర రాక.. పెట్టుబడి సైతం తిరిగి అందక ఇబ్బంది పడుతున్నారు. గంటల పాటు మార్కెట్ లో నిరీక్షిస్తున్నా పంట మాత్రం అమ్ముడు కాని పరిస్థితి సైతం ఎదుర్కొంటున్నారు.
25 కిలోల టమాట ట్రే 100 రూపాయలు మాత్రమే పలుకుతున్న పరిస్థితుల్లో.. పెట్టిన మదుపులు రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు గ్రామాల రైతులు పట్టణ ప్రాంతాలకు సరకు తీసుకెళ్లి కష్టపడి విక్రయిస్తున్నా.. కూలీ డబ్బులు సైతం గిట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.