విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నగదు ఇవ్వలేదని సాలూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన జేసీ కృష్ణకిషోర్... రైతుల నుంచి సేకరించిన ధాన్యం గోదాముల్లో ఎంత ఉంది, ఎంత వరకు చెల్లింపులు చేయాలనే వివరాలు సేకరించారు. రైతులకు డబ్బులు అందించేందుకు, మిగిలిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యం డబ్బుల కోసం రైతుల ఆందోళన - vizianagaram dst problems of farmers
గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇవ్వకపోవటంపై విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న జేసీ కృష్ణకిషోర్ వివరాలు సేకరించి వెంటనే డబ్బు వచ్చేలా చర్యలు తీసుకుంటాని హామీఇచ్చారు.
![ధాన్యం డబ్బుల కోసం రైతుల ఆందోళన farmers protest in vizianagaram dst about money of their field](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7279727-24-7279727-1589983664657.jpg)
farmers protest in vizianagaram dst about money of their field