విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో శనివారం వీచిన గాలులకు.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, అరటి పంట నేలకొరిగింది. వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేసే పనిలో పడ్డారు.
మండలం మొత్తం 12 వందల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 80 శాతం పంట సాగు చేసిన అనంతరం.. ఈదురు గాలులకు పడిపోయింది. 800 హెక్టార్లలో అరటి సాగు చేస్తుండగా.. మామిడిపల్లిలో దాదాపు 160 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.