విజయనగరం జిల్లాలో వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, మెరకముడిదాం, మండలాల్లో వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అయితే లాక్డౌన్ సందర్భంగా పంటకు ప్రభుత్వమే మద్దతు ప్రకటించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ద్వారా 33 వేల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశారు.
మెరకముడిదాం మండలం గరుగుబిల్లి, శాతం వలస, ఏడిక గ్రామాల్లో సుమారు వందలాది మంది రైతుల దగ్గర మొక్కజొన్న పంట అలాగే ఉండి పోయింది. ప్రభుత్వం స్పందించి తమ దగ్గర పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పెట్టుబడులు పెట్టి, కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 రోజులుగా తమ వద్దే పంట ఉండిపోవడం, నాణ్యత కోల్పోయి, పురుగు పడుతోందని, దీని ద్వారా మార్కెట్ విలువ కోల్పోతున్నామన్నారు.