బిందు సేద్యంతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏపీడీ కె.మన్మధరావు అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సిబ్బందికి బిందు, తుంపర సేద్యాలపై అవగాహన కల్పించారు. బిందు సేద్యం, తుంపర సేద్యం పద్ధతుల్లో సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. బిందు సేద్యం వల్ల ఒక ఎకారను తడిపే నీటితో మూడు ఏకరాల భూమిని తడపవచ్చని చెప్పారు.
బిందు సేద్యంపై అవగాహన కార్యక్రమం - Farmers' awareness on drip irrigation
బిందు, తుంపర సేద్యంపై విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సిబ్బందికి, రైతులకు అవగాహన కల్పించారు.

బిందు సేద్యంపై రైతులకు అవగాహన..
రసాయనిక ఎరువులను.. మొక్కలకు నేరుగా అందిచవచ్చని, దీనివల్ల కలుపు సమస్య ఉండదన్నారు. రాత్రి సమయాల్లో రైతులు మోటర్లు వేయడానికి పొలాల వద్దకు వెళ్లనవసరం లేదని...ఆటో స్టార్టర్ ఉంటుందని వివరించారు. అనంతరం అరటి తోటలో వ్యవసాయ సిబ్బందికి డెమో ప్రదర్శన చూపించారు.