ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం అమ్ముకోవటానికి ఓ వైపు రైతు... మరోవైపు మిల్లర్ల అగచాట్లు - విజయనగరం జిల్లా తాజా సమాచారం

Farmers Problem : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతులు.. మర ఆడించిన బియ్యం ప్రభుత్వం తీసుకోకపోవడంతో మిల్లర్లు... తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా... ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉండిపోయింది. ఆ ధాన్యాన్ని పాడవకుండా కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని రైతులు, మిల్లర్ల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

Farmers Problem
Farmers Problem

By

Published : Feb 14, 2022, 9:13 PM IST

ధాన్యం అమ్ముకోవటానికి ఓ వైపు రైతు... మరోవైపు మిల్లర్ల అగచాట్లు

Farmers Problem: విజయనగరం జిల్లాలో ఏటా ధాన్యం దిగుబడి అంచనా 6.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. కొనుగోలు లక్ష్యం 4.5 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంది. ఇప్పటివరకు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులు తమ పంటను రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్తే... ధాన్యం కొనుగోలు చేయటం లేదని వెనక్కి పంపిస్తున్నారు. మరికొన్ని చోట్ల సర్వర్ పని చేయడం లేదని చెబుతున్నారు. పంట నమోదు కాకపోవడంతో 10 నుంచి 15 శాతం మంది రైతులు పంటను అమ్ముకోలేదు. ఎంతో కొంత ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు.. దళారులను వేడుకున్నా వారు కూడా తీసుకోవటం లేదు. కల్లాల్లోనే ఉండిపోయిన ధాన్యాన్ని పందులు, ఎలుకలు నాశనం చేయకుండా కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పది రోజులుగా మిల్లింగ్‌ నిలిపివేశాం..

గతంలో ఎన్నడూ లేనివిధంగా మిల్లర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కస్టమైజ్డ్‌ మిల్లింగ్‌ రైస్‌... జిల్లా అవసరాలకు సరిపోయిందని చెప్పడంతో బియ్యాన్ని ఏం చేయాలో తెలియక మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. పిన్ డ్యామేజ్ పేరుతో ఇప్పటికే సార్టెక్స్‌ బియ్యం లోడుతో పంపిన లారీలు వెనక్కి వచ్చేస్తుండటంతో.. పది రోజులుగా మిల్లింగ్‌ నిలిపివేసినట్లు ఓ మిల్లు యజమాని తెలిపాడు. మిల్లుల్లో వేలాది టన్నుల ధాన్యం నిల్వ ఉండిపోయిందని.. ధాన్యం మొలకెత్తి పాడైపోతోందని చెప్పాడు. అప్పులు చేసి పంట సాగు చేశామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు, మిల్లర్లు కోరుతున్నారు.

నేను కౌలుకు మూడెరాలు తీసుకున్న, సొంతంగా రెండు ఎకరాలు సాగు చేస్తున్నా. పంట కోసం అప్పు తెచ్చి రూ.1.50 లక్షల దాకా ఖర్చు చేశాను. ఇప్పుడా ధ్యాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయటం లేదు. రెండు నెలలుగా పొలంలోనే పంటను నిల్వ చేశాను. కొనుగోలు కేంద్రాలకు వెళితే ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. -ఓ రైతు ఆవేదన

ఇదీ చదవండి :Input Subsidy to farmers: రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.. మంగళవారం విడుదల చేయనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details