విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలోని వంగ రైతుల్ని.. నష్టాలు వీడటంలేదు. వైరస్ సోకి చేతికొచ్చిన పంట పాడైపోతోందని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. తెగుళ్లతో వంగ తోటలు ఎండిపోయి కాయలు రాలిపోతున్నాయి. ఎన్ని ఎరువులు, పురుగు మందులు కొట్టినా చీడ తొలగడం లేదు. పెట్టబడి మొత్తం నీరుగారిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ బాధ పడుతున్నారు రైతులు. పార్వతీపురం మండలం బాలగొడవ, తాళ్లపూడి, బోండపల్లి సహా పలు ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వం, అధికారులే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వంగ పంటకు వైరస్.. ఆందోళనలో రైతులు - brinjal crop at parvatipuram news
ఆరుగాలం కష్టపడిన రైతు శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. పంట చేతికొచ్చే సమయానికి.. ఏదో ఒక రూపంలో వచ్చే విపత్తుల కారణంగా నష్టాలు చవిచూస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వంగ పంటకు వైరస్ సోకటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![వంగ పంటకు వైరస్.. ఆందోళనలో రైతులు Farmers affected by virus infection to brinjal crop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11119649-348-11119649-1616480242055.jpg)
వంగ పంటకు వైరస్ సోకడంతో నష్టపోయిన రైతులు