ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూట్యూబ్​లో చూసి దొంగనోట్ల తయారీ..ఆరుగురు అరెస్టు - దొంగనోట్ల ముఠా

యూట్యూబ్​లో చూసి దొంగనోట్లను తయారు చేసిన ఆరుగురు సభ్యుల ముఠాను విజయనగరం జిల్లా భోగాపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి 31లక్షల దొంగనోట్లు, 64వేల 500 అసలు నోట్లు, 5చరవాణీలు, నోట్ల ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

యూట్యూబ్​లో చూసి దొంగనోట్ల తయారీ..ఆరుగురు అరెస్టు !
యూట్యూబ్​లో చూసి దొంగనోట్ల తయారీ..ఆరుగురు అరెస్టు !

By

Published : Jun 30, 2020, 5:32 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం పోలీసులు ఆరుగురు సభ్యులు గల దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 31లక్షల రూపాయల దొంగనోట్లు, 64వేల 500 అసలు నోట్లు, ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం...భోగాపురం మండలం అక్కివరానికి చెందిన కంది రాము ఇంజనీరింగ్ చదివి పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేశాడు. చెడు వ్యసనాలకు బానిసై... సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ ద్వారా దొంగ నోట్లు ముద్రణపై శిక్షణ పొందాడు. ఈ క్రమంలో మరో ఐదుగురితో కలిసి విజయనగరంలోని ఓ జిరాక్స్ దుకాణంలో దొంగనోట్లు ముద్రించారు.

భోగాపురం మండలం అవనాం మార్కెట్​లో నిందితులు రెండు గొర్రెలు కొనుగోలు చేసి.. 20 వేల దొంగనోట్లను చెల్లించారు. నోట్లను నిశితంగా పరిశీలించిన గొర్రెల వ్యాపారులు.. అవి దొంగ నోట్లని నిర్థరించుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ప్రధాన నిందితుడితో కలిపి ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 31లక్షల దొంగనోట్లు, 64వేల 500 నగదు (అసలునోట్లు), 5చరవాణీలు, నోట్ల ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details