ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. నియోజకవర్గంలో పిడుగు పాటు కారణంగా మరణించినవారి కుటుంబాలకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున నెల్లిమర్ల, మహారాజు పేటకు చెందిన వారికి అందజేశారు. తుపానులు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.
పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం - VIZIANAGARAM NELLIMARLA THUNDER NEWS UPDATES
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై చనిపోయిన వారి కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే అప్పలనాయుడు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు.

THUNDER DEATH FAMILIES IN VIZIANAGARAM NELLIMARLA
Last Updated : Nov 8, 2019, 12:31 PM IST