నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం ఊటను.. ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం కొర్లాం శివారు ప్రాంతంలో జరిగిందీ ఘటన.
చీపురుపల్లి ఎస్ఐ ప్రసాదరావు, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలు.. సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నిర్వాహకులు భారీ ఎత్తున సామాగ్రి నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా దాడులకు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటామన్నారు.