మద్యపాన నిషేధం కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ 'టీం జాగృతి' బృందం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సారిక పంచాయతీలోని ఇళ్లలో సోదాలు చేశారు.
సారా ప్యాకెట్లు తయారు చేసే పనిముట్లు దొరకడంపై.. ఆ ఇళ్లలో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. సారాతో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండి సారా వ్యాపారాలకు దూరంగా ఉండాలని చెప్పారు.