ఓ పక్క లాక్డౌన్ ప్రభావంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతుంటే... నాటుసారా తయారీదారులు మాత్రం దందా కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లా చిమనేరంగి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు సారా దుకాణాలపై ఆకస్మిక దాడి చేశారు. నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామస్థులకు కరోనాపై అవగాహన కల్పించారు.
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడి - latest news of chinamerangi village liquor news
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. చినమేరంగి గ్రామంలో నిల్వచేసిన నాటుసారా, నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా కేంద్రాలు ఎక్సైజ్ అధికారుల దాడి