ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగాపురంలో గుప్త నిధుల కోసం అర్థరాత్రి తవ్వకాలు - Vizianagaram news

గుప్తనిధుల కోసం కొంతమంది అర్థరాత్రి క్షద్రపూజలు చేసి తవ్వకాలు చేస్తుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంప్రవేశం చేసి పట్టుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవ పాలెం కొండోడు గుట్టలో జరిగింది.

భోగాపురంలో గుప్త నిధుల కలకలం
భోగాపురంలో గుప్త నిధుల కలకలం

By

Published : Nov 29, 2020, 10:53 PM IST


విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెం పంచాయతీ బసవ పాలెం రెవిన్యూలో దట్టమైన అరణ్య మార్గంలో కొండోడుగుట్టలో గుప్త నిధులు ఉన్నాయంటూ కొందరు తవ్వకాలు చేపట్టడం సంచలనం రేపింది. శనివారం అర్ధరాత్రి పది మంది బృందంతో ఓ ప్రదేశంలో క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలను ప్రారంభించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో వారిని పట్టుకున్నారు. రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో సుమారు పదిహేను అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి అక్కడ ఏమీ లేదని రుజువు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details