ప్రతిపక్షంలో ఉన్నపుడు బాదుడే బాదుడు అంటూ గొంతుచించుకున్న జగన్..అధికారంలోకి రాగానే ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని తెదేపా మహిళానేత గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. సంపద సృష్టించలేక ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం వేస్తూ..ధరలు పెంచుతోందని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉంటే..ఏపీలో మాత్రం గతనెల రోజుల వ్యవధిలోనే 18 సార్లు ధరలు పెంచారని ఆక్షేపించారు.
ప్రభుత్వ చర్యతో నిత్యావసర ధరలు పెరగటంతో పాటు, లారీ పరిశ్రమ పూర్తిగా కుదైలైపోయిందని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారముందని ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.