విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. రీ కౌంటింగ్ చేయాలని ఎస్. కోట తెదేపా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓట్ల లెక్కింపులో అవకతవకల కారణంగా తెదేపా బలపరిచిన అభ్యర్థికి అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబును విజ్ఞప్తి చేశారు.
కొత్తవలస పంచాయతీ ఓట్ల లెక్కింపుపై ఎస్ఈసీకి ఫిర్యాదు - vijayanagaram latest news
కొత్తవలస పంచాయతీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆరోపించారు. రీ కౌంటింగ్ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబును కలిసి ఫిర్యాదు చేశారు.
తెదేపా బలపరిచిన అభ్యర్థి తిరుపతి రావు 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి తొలుత ప్రకటించారని.. మరో పది నిమిషాల తేడాతో 10 ఓట్ల మెజార్టీతో వైకాపా బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయంపై ఆర్డీవోను కలిసినా ఉపయోగం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరుగుతుందని భావించి ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి వచ్చామన్నారు. ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని కన్నబాబు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:బియ్యాలవలసలో డ్రోన్ ప్లయింగ్ ద్వారా భూ సర్వే