Chinna Rajappa Comments on Jagan: ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన.. జీవో నెం.1పై అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై వివరణ ఇవ్వాలనుకుంటే పాలనాధిపతి అయిన చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ లేదా డీజీపీ స్పందించాల్సి ఉంటుందన్నారు.
జగన్ చేసిన తప్పుకు లెంపలేసుకోవాలి: నిమ్మకాయల చినరాజప్ప - AP imporartent news
Chinna Rajappa Comments on Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా మండిపడ్డారు. చేసిన తప్పుడు పనికి సీఎం జగన్ రెడ్డి లెంపలేసుకొని.. తక్షణమే చీకటి జీవోను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జీవో నెంబర్ 1పై అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడిన తీరుపై ఆగ్రహించారు.
![జగన్ చేసిన తప్పుకు లెంపలేసుకోవాలి: నిమ్మకాయల చినరాజప్ప Chinarajappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17451324-655-17451324-1673371208197.jpg)
సీఎం జగన్ లెంపలేసుకోవాలి
కానీ, అడిషనల్ డీజీ ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వడానికి ఆయనకు డీజీపీ ఏమైనా తమ అధికారాన్ని ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చేసిన ఒత్తిడితో అడ్డగోలు జీవో విడుదల చేసిన ఉన్నతాధికారులు సమాధానం చెప్పడానికి ముఖం చెల్లక కిందిస్థాయి అధికారులతో మాట్లాడించడం సిగ్గుచేటన్నారు. చేసిన తప్పుడు పనికి సీఎం జగన్ రెడ్డి లెంపలేసుకొని, తక్షణమే చీకటి జీవోను ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి