విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడలో ఉపాధి వేతనం గిట్టుబాటు కాలేదంటూ... 64 గ్రూపులకు చెందిన 589 వేతనదారులు.... మెంటాడ మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. రోజుకు 50 నుంచి 60 రూపాయల వరకు మాత్రమే ఉపాధి వేతనం వస్తోందని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే తాము పనిచేస్తున్నామని... అయినా వేతనం విషయంలో మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చెేయ్యాలంటూ ఎంపీడీవోను నిలదీశారు. స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో వెనుదిరిగారు.
'ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నా... తేడా ఎందుకు?'
ఉపాధి హామీ పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేస్తున్నా... పనికి తగ్గ వేతనం లభించట్లేదంటూ విజయనగరం జిల్లా పిట్టాడ ఉపాధి హామీ కార్మికులు ఆందోళ వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారుల్ని నిలదీశారు.
ఉపాధి హామీ వేతన దారులు ఆందోళన