ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపైఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా.. స్థానిక ఉద్యోగులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తున్నాం: సూర్యనారాయణ - TELUGU NEWS
![ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తున్నాం: సూర్యనారాయణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమలును వ్యతిరేకిస్తున్నాం: సూర్యనారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14138688-thumbnail-3x2-surya.jpg)
13:27 January 09
విజయనగరం యూత్ హాస్టల్‌లో ఉద్యోగుల చైతన్య వేదిక సభ
మెరుగైన ఫిట్‌మెంట్ విఫలమైందన్న ఆయన.. 23 శాతం ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు సంతోషంగా లేరని అన్నారు. పీఆర్సీపై ఉద్యోగుల్లో అయోమయం నెలకొందని అన్నారు. ఈ పీఆర్సీతో ప్రయోజనం లేకపోగా.. నష్టం కలుగుతుందని అన్నారు. ఉద్యోగ సంఘాలతో సీఎం మళ్లీ పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉద్యోగులను చైతన్య పరుస్తామని సూర్యనారాయణ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
FAMILY SUICIDE: నిజామాబాద్ వాసుల ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..సూసైడ్ నోట్‌లో ఏముందంటే?